Tuesday, December 22, 2009
ఇస్లామిక్ సమాజంలో స్త్రీల హోదా
ఇస్లాం మతం స్త్రీల పై అనేక కట్టుబాట్లు విధించింది. అవి స్త్రీలని స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియని జీవచ్ఛవాలని చేసే కటుబాట్లు. ముస్లిం మత పెద్దలు ఆ కట్టుబాట్లు స్త్రీలకి రక్షణ కవచాలు అని అంటారు. ముఖ్యంగా హిజబ్ (ముసుగు వేసుకోవడం) రక్షణ కోసం అని చెపుతారు. పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలలో ముస్లిం మహిళలు సినిమాలు చూడడం పై నిషేధం ఉంది. పాకిస్తానీ ఇస్లామిక్ చాంధసవాదుల్ని ఆదర్శంగా తీసుకుని మన దేశంలో కూడా కొన్ని పట్టణాలు, గ్రామాలలో ముస్లిం మహిళలు సినిమాలు చూడడం పై నిషేధం విధించారు. కానీ ఆ ప్రాంతాలలో ముస్లిం పురుషులు సినిమాలు చూడడం పై నిషేధం లేదు. ముస్లిం పురుషులు కూడా సినిమాలలో బూతు డాన్సులు, ముద్దు సన్నివేశాలు, రేప్ సన్నివేశాలు చూసి ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి అంత నిజాయితీ ఉంటే ముస్లిం పురుషులు కూడా సినిమాలు చూడడాన్ని నిషేధించాలి కానీ వాళ్ళు అలా చెయ్యరు. స్త్రీ-పురుష సంబంధాల విషయంలో తమకి నిజాయితీ లేదని నగ్నంగా నిరూపించుకుంటారు. మహారాష్ట్రంలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న జిల్లాలలో ముస్లిం మహిళలు సినిమాలు చూడకూడదనే నిషేధం సమర్థవంతంగా అమలు అవుతోంది. అక్కడ ముస్లిం మత చాంధసవాద సంస్థలు కిరాయి గూండాలని ఏర్పాటు చేశాయి. ముస్లిం మహిళలు దొంగచాటుగా సినిమాలకి వెళ్ళడం కనిపిస్తే గూండాలు వాళ్ళని పటుకుని చితక బాదుతారు. ఇదీ ముస్లింలు స్త్రీలకి ఇచ్చే గౌరవం. ఇంకో ఇస్లామిక్ చాంధసవాద సంస్థ వాళ్ళు ముస్లిం మహిళా నటులు సినిమాలలో ముస్లిం పాత్రలు మాత్రమే వెయ్యాలని ఫత్వా జారీ చేశారు. మధ్య ప్రదేశ్ లోని ఓ ఉర్దూ మీడియం బాలికల పాఠశాలలో బాలికలు తప్పనిసరిగా హిజబ్ (ముసుగులు) వేసుకోవాలని పాఠశాల హెడ్ మిస్ట్రెస్ రూల్ పెట్టింది. కొంత మంది బాలికల తల్లితండ్రులు గొడవ చెయ్యడం కూడా జరిగింది. ముంబై నగరంలో ఓ తండ్రి తన తొమ్మిదేళ్ళ బాలిక చేత బురఖా వెయ్యించి స్కూల్ కి పంపాడు. బురఖా వేసుకోవడం స్కూల్ యూనిఫార్మ్ రూల్స్ కి వ్యతిరేకమని స్కూల్ మేనేజ్మెంట్ అభ్యంతరం చెప్పింది. ఆ తండ్రి కోర్టుకి వెళ్ళాడు. కోర్టు ఆ కేసుని డిస్మిస్ చేసింది. కట్టుబాట్ల పేరుతో స్త్రీలకి ఇనుప సంకెళ్ళు వేసి వాటినే రక్షణ కవచాలు అంటారు ముస్లింలు.
కువైట్ దేశంలోని కాలేజిలలో అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడడం నిషిద్ధం. ఇలాంటి చాదస్తపు మనుషులు మన హిందూ మతంలో కూడా ఉన్నారు. గుంటూరు నగరంలోని ఒక కాలేజిలో ఆర్థికంగా-సామాజికంగా ముందున్న ఒక కులానికి చెందిన విధ్యార్థులు తమ కులానికి చెందిన అమ్మాయిలు వేరే కులానికి చెందిన అబ్బాయిలతో మాట్లాడకూడదని రూల్ పెట్టారు. ఆ కాలేజిలో గొడవ కూడా జరిగింది. ఆడవాళ్ళు విమానాలు నడుపుతున్న యుగంలో కూడా ఆడవాళ్ళ పై ఇలాంటి సంకుచిత నమ్మకాలు కలిగి ఉండడం హాస్యాస్పదం. "ఇస్లాం అంటే ఏమిటి" పుస్తకం చాలా ముస్లిం దేశాలలోని మహిళల దుస్థితి గురించి సమాచారం అందించింది కానీ ఈ పుస్తకంలో కూడా కొన్ని నెగటివ్స్ ఉన్నాయి.
"ఇస్లాం అంటే ఏమిటి" పుస్తక రచయితకి టర్కీ దేశంలోని మహిళల పరిస్థితి గురించి మాత్రం అవగాహన లేదు. ఈ పుస్తకంలో టర్కీ దేశం గురించి గొప్పగా వ్రాయడం బాగాలేదు. టర్కీ దేశ ప్రజలలో కూడా స్త్రీల పై అనేక మూఢ నమ్మకాలు ఉన్నాయి. ఆ దేశంలోని కొన్ని ప్రాంతాలలో స్త్రీలకి పెళ్ళికి ముందు కన్యత్వ పరీక్షలు చెయ్యిస్తారు. భర్త చనిపోయిన స్త్రీకి రెండవ పెళ్ళి చేసుకునే హక్కు ఉండాలి. ఇలాంటప్పుడు కన్యత్వ పరీక్షలు అనేవి అనవసరం, అనాగరికం కూడా. అక్రమ సంబంధం విషయంలో ఎవరూ కన్యత్వం గురించి ఆలోచించరు. భర్త బతికి ఉన్న స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకునేటప్పుడు కూడా కన్యత్వం గురించి ఆలోచించరు. పెళ్ళి విషయంలో మాత్రం కన్యత్వం గురించి లేనిపోని పట్టింపులకి పోతారు. ముస్లింలలో కూడా కన్యత్వ పరీక్షలని వ్యతిరేకించేవాళ్ళు ఉన్నారు. ఈ పరీక్షలు మహిళల హక్కులకి భంగం అని అంగీకరించే ముస్లింలు కూడా ఉన్నారు. జోర్డాన్ దేశంలో ఇలాంటి పరీక్షలు నిషేధించబడ్డాయి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Thank you for visit our blog. Keep touch with my blog.