Sreenath Reddy M.V
Music Sports News Games Blogs Movies Results Jobs
"Friendship is a soft feeling of heart, but its very …hard to feel, n when it feels, its too hard to drop. B’coz true frndship happens once in life."

Earn Money From send Free SMS

Monday, May 31, 2010

చిన్న పిల్లలకు నేర్పవలసిన (పిల్లలు నేర్చుకోవలసిన) కొన్ని మంచి అలవాట్లు

  • వేకువ(తెల్లవారు) జామునే లేవటం.

  • లేచిన వెంటనే పక్క బట్టలు తీయటం.

  • శుభ్రంగా పళ్ళు తోముకోవటం

  • శుభ్రంగా క్రింద పడకుండా పలహారం(టిఫిన్) తినటం.

  • శుభ్రమైన బట్టలు ధరించటం.

  • చక్కగా తల దువ్వు కోవటం.

  • బూట్లను శుభ్రంగా ఉంచుకోవాలి.

  • బడికి వెళ్ళేటప్పుడు బూట్లను శుభ్రంగా తుడుచుకొని బూట్లను వేసుకోవాలి.

  • వేళకు బడికి (స్కూల్‌కి) వెళ్ళటం.

  • బడికి వెళ్ళటానికి పది నిమిషాల ముందే కావలసినవన్ని సంచిలో (Bag) సర్దుకోవాలి.

  • ఉపాధ్యాయులను గౌరవించటం.

  • సాటి విధ్యార్ధితో స్నేహ భావంతో మెలగటం.

  • ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, మంచి మాటలు నేర్చుకోవటం.

  • ఇంటిలోకి వచ్చే ముందు కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని రావాలి.

  • ఇంటి పని (హొం వర్క్) సరిగ్గా చేయటం.

  • ఇంటి పని (హొం వర్క్) అయిన తర్వాతనే ఆడుకోవాలి.

  • అమ్మకి చిన్న చిన్న పనులలో సాయంచేయటం.

  • ఖాళీ సమయాల్లో బొమ్మలు గీయటం, చిన్న చిన్న కథలు చదవటం వంటివి చేయటం.

  • భోజనం చేసే ముందు చేతులు కడుగుకోవటం.

  • భోజనం చేసే ముందు వస్తువులను (గిన్నెలను) తీసుకురావటానికి అమ్మకు సాయం చేయటం.

  • తిన్న వెంటనే పళ్ళు తోముకోవటం.

  • ఆడుకున్న తరువాత ఆట వస్తువులను సర్దుకోవాలి.

  • టి.వి. చూసేటప్పుడు టి. వి. కి దగ్గరగా కూర్చోవద్దు.

  • నీళ్ళు వృధా  చేయవద్దు.

  • నీళ్ళు పట్టు కోవటం అయిన వెంటనే పంపు కట్టేయాలి.

  • రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.

  • పెద్ద వారు ఎదురైనప్పుడు నమస్కారం చేయటం.

  • ఇంటికి వచ్చిన వారిని గౌరవించటం.

  • పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడటం.

  • నిప్పుతో లేక అగ్గిపుల్లలతో ఆడకూడదు.

  • గ్యాస్ పొయ్యితో (బర్నర్‌తో) ఆడకూడదు.

  • కరెంటు వైర్లతో, స్విచ్చులతో, ప్లగ్గులతో ఆడకూడదు.

  • ఏదైన తిన్న తరువాత కాగితాలను, తొక్కలను చెత్తకుండీలో (Dust Bin) వేయాలి.

  • పుస్తకాలను చక్కగా సర్దుకోవాలి.

  • పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం.

  • అసత్యం ఆడకూడదు.

  • ఆకలిగొన్న వానికి అన్నము పెట్టుము.

  • ఒకరి మీద చాడీలు చెప్పరాదు.

  • తనను తాను పొగడు కొనరాదు.

  • తల్లిదండ్రులను కష్ట పెట్టరాదు .

  • విద్య చెప్పిన వారిని మరువరాదు.

  • పెద్దల మాటలు వినవలెను.

  • పేదల మీద దయ ఉంచవెలెను.

  • స్వామి యందు భక్తి నుంచుము.

  • సజ్జనులతో స్నేహము చేయవలెను.

  • ఎల్లప్పుడూ దైవచింతన చేయుము.

  • నమ్మిన వారిని మోసం చేయరాదు.

  • మనిషికి మాటే అలంకారం.

  • మాట వెండి, మౌనం బంగారం.

  • గురువుల మాట వినాలి.

  • పరనింద పనికిరాదు.

  • తొందరపడి ఏ పనీ చేయరాదు.

  • ఆటలాడుచోట, అలుక పూనరాదు.

  • మంచిని మించిన గుణం లేదు.

  • ఆడిన మాట తప్పరాదు.

  • పెద్దలను గౌరవించాలి.

  • చెడువారి చెలిమి చేయరాదు.

  • చేసిన మేలు మరువరాదు.

  • జీవహింస చేయరాదు.

  • బీదలను చూసి హేళన చేయవద్దు.

  • నోరు మంచిదయితే, ఊరు మంచిదవుతుంది.

  • మంచి అలవాట్లకు మించిన ధనం లేదు



--
Regards
-------
M.V. Sreenath Reddy
7411134113
www.mulbagal.blogspot.com

No comments:

Post a Comment

Thank you for visit our blog. Keep touch with my blog.

Earn Money From send Free SMS