చిన్న పిల్లలకు నేర్పవలసిన (పిల్లలు నేర్చుకోవలసిన) కొన్ని మంచి అలవాట్లు
-
వేకువ(తెల్లవారు) జామునే లేవటం.
-
లేచిన వెంటనే పక్క బట్టలు తీయటం.
-
శుభ్రంగా పళ్ళు తోముకోవటం
-
శుభ్రంగా క్రింద పడకుండా పలహారం(టిఫిన్) తినటం.
-
శుభ్రమైన బట్టలు ధరించటం.
-
చక్కగా తల దువ్వు కోవటం.
-
బూట్లను శుభ్రంగా ఉంచుకోవాలి.
-
బడికి వెళ్ళేటప్పుడు బూట్లను శుభ్రంగా తుడుచుకొని బూట్లను వేసుకోవాలి.
-
వేళకు బడికి (స్కూల్‌కి) వెళ్ళటం.
-
బడికి వెళ్ళటానికి పది నిమిషాల ముందే కావలసినవన్ని సంచిలో (Bag) సర్దుకోవాలి.
-
ఉపాధ్యాయులను గౌరవించటం.
-
సాటి విధ్యార్ధితో స్నేహ భావంతో మెలగటం.
-
ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, మంచి మాటలు నేర్చుకోవటం.
-
ఇంటిలోకి వచ్చే ముందు కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని రావాలి.
-
ఇంటి పని (హొం వర్క్) సరిగ్గా చేయటం.
-
ఇంటి పని (హొం వర్క్) అయిన తర్వాతనే ఆడుకోవాలి.
-
అమ్మకి చిన్న చిన్న పనులలో సాయంచేయటం.
-
ఖాళీ సమయాల్లో బొమ్మలు గీయటం, చిన్న చిన్న కథలు చదవటం వంటివి చేయటం.
-
భోజనం చేసే ముందు చేతులు కడుగుకోవటం.
-
భోజనం చేసే ముందు వస్తువులను (గిన్నెలను) తీసుకురావటానికి అమ్మకు సాయం చేయటం.
-
తిన్న వెంటనే పళ్ళు తోముకోవటం.
-
ఆడుకున్న తరువాత ఆట వస్తువులను సర్దుకోవాలి.
-
టి.వి. చూసేటప్పుడు టి. వి. కి దగ్గరగా కూర్చోవద్దు.
-
నీళ్ళు వృధా చేయవద్దు.
-
నీళ్ళు పట్టు కోవటం అయిన వెంటనే పంపు కట్టేయాలి.
-
రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
-
పెద్ద వారు ఎదురైనప్పుడు నమస్కారం చేయటం.
-
ఇంటికి వచ్చిన వారిని గౌరవించటం.
-
పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడటం.
-
నిప్పుతో లేక అగ్గిపుల్లలతో ఆడకూడదు.
-
గ్యాస్ పొయ్యితో (బర్నర్‌తో) ఆడకూడదు.
-
కరెంటు వైర్లతో, స్విచ్చులతో, ప్లగ్గులతో ఆడకూడదు.
-
ఏదైన తిన్న తరువాత కాగితాలను, తొక్కలను చెత్తకుండీలో (Dust Bin) వేయాలి.
-
పుస్తకాలను చక్కగా సర్దుకోవాలి.
-
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం.
-
అసత్యం ఆడకూడదు.
-
ఆకలిగొన్న వానికి అన్నము పెట్టుము.
-
ఒకరి మీద చాడీలు చెప్పరాదు.
-
తనను తాను పొగడు కొనరాదు.
-
తల్లిదండ్రులను కష్ట పెట్టరాదు .
-
విద్య చెప్పిన వారిని మరువరాదు.
-
పెద్దల మాటలు వినవలెను.
-
పేదల మీద దయ ఉంచవెలెను.
-
స్వామి యందు భక్తి నుంచుము.
-
సజ్జనులతో స్నేహము చేయవలెను.
-
ఎల్లప్పుడూ దైవచింతన చేయుము.
-
నమ్మిన వారిని మోసం చేయరాదు.
-
మనిషికి మాటే అలంకారం.
-
మాట వెండి, మౌనం బంగారం.
-
గురువుల మాట వినాలి.
-
పరనింద పనికిరాదు.
-
తొందరపడి ఏ పనీ చేయరాదు.
-
ఆటలాడుచోట, అలుక పూనరాదు.
-
మంచిని మించిన గుణం లేదు.
-
ఆడిన మాట తప్పరాదు.
-
పెద్దలను గౌరవించాలి.
-
చెడువారి చెలిమి చేయరాదు.
-
చేసిన మేలు మరువరాదు.
-
జీవహింస చేయరాదు.
-
బీదలను చూసి హేళన చేయవద్దు.
-
నోరు మంచిదయితే, ఊరు మంచిదవుతుంది.
-
మంచి అలవాట్లకు మించిన ధనం లేదు
--
Regards
-------
M.V. Sreenath Reddy
7411134113
www.mulbagal.blogspot.com